జారెద్ డైమండ్ వ్రాసిన గన్స్ , జెర్మ్~స్ , అండ్ స్టీల్ అనే పుస్తక రివ్యూ!

Jun 20
2007

జారెద్ డైమండ్ వ్రాసిన గన్స్ , జెర్మ్~స్ , అండ్ స్టీల్ అనే పుస్తక రివ్యూ!

ఈ పుస్తకాన్ని మనం తెలుగులో తుపాకులు, క్రిములు, స్టీలు అని పిల్చుకుందమా?

మొదట ఈ పుస్తకం గురించి పొద్దులో రోహిణీ ప్రసాదు గారి వ్యాసానికి  సీమూర్గ్ గారు వ్రాసిన వ్యాఖ్య నుండి తెలిసింది, తరువాత కొందామని ఒడిస్సీకి వెళ్లి అక్కడ స్టాకు లేక వాల్డన్ కి వెళ్లి ఐదు వందల రూప్యములతో కొనడము జరిగినది. కొద్దిగా ఎక్కువే, నేను సాధారణంగా మూడు వందల కన్నా ఎక్కువ రేటు ఉంటే కొనే ముందు ఓ రెండు సార్లు ఆలోచిస్తాను, కానీ సీమూర్గ్ గారి వ్యాఖ్య ప్రభావంతో మంచి పుస్తకాలు చదవాలన్న ప్రగాడమైన అభిలాషతో కొనడం జరిగినది. పుస్తకము నన్ను నిరాశ పరచలేదు మొదటి మూడు వందల పేజీలు చాలా ఆసక్తికరంగా ఉన్నాయి తరువాతి రెండు వందలూ కొద్దిగా బోర్ కొట్టినాయి.

క్రిటిక్లు:
1. ఇది పూర్తిగా యూరో అమెరికా సెంట్రిక్కుగా వ్రాయబడిన పుస్తకము
2. రచయత వ్రాసిన అన్ని  విషయలతో అందరూ ఏకీభవించరు, కానీ అతని శైలిలో ఆలోచించడము ఓ నూతన (ఓకే నాబోటి గాళ్ళకి) మార్గం కనిపిస్తుంది.
3. ప్రపంచ చరిత్రలో పేద్ద పార్టు ఉన్న ఇండియాకు ఈ పుస్తకంలో లభించిన భాగం చాలా తక్కువ, నాలుగైదు లైన్లు మాత్రమే!
4. ఇదే విషయాలపై ఎవరన్నా ఇండియా చరిత్రని కూడా చక్కగా వ్రాస్తే చాలా ఇంటరెస్టింగుగా ఉంటుంది, ముఖ్యముగా అడ్డమైన కంక్లూజన్లకు ముందే రాకుండా వ్రాస్తే :)
5.బియ్యం  పండే ప్రాంతాలు ఇన్ ఇండియా వర్సస్ గోధుమలు పండే ప్రాంతాలు, కాలవలు రాక ముందు మన వాళ్లు పండించే సజ్జలు, రాగులు మొన్నగున్నవి.
6. వివిధ కులాలు, వారి ఆహారపు అలవాట్లు
7. ద్రావిడ భాషలు, ఇండో యూరోపియను భాషలు, ద్రావిడ భాషల పుట్టుక?
8. సరేలేగాని ఇరవై వేల సంవత్సరాల క్రితం ఇక్కడ ఎవరు ఉండేవారు? మన పురాతన తవ్వకాలు ఇంకా చురుగ్గా జరగాలి.

ఎట్సెట్రా…..

ఇహ పుస్తకం విషయనికి వస్తే

ఇది రచయత చెప్పినట్టే గత పదమూడు వేల సంవత్సరాల మానవ్ నాగరికథ చరిత్ర, కానీ ఎక్కువగా యూరోపు, అమెరికా దృష్టిలో చెప్పబడినది.
నేను తెలుసుకున్న కొత్త విషయాలు కొన్ని
1. యూరోపు వాళ్ళు అమెరికా ఖండాలు వెళ్లకముందు ఆ ఖండాలలో మిలియన్ల కొద్దీ జనాభా ఉండేవారు, వారిలో ఎక్కువగా యూరోపు వాళ్ళ్ అంటు వ్యాధుల వల్లనే మరణించినారు, మిగిలిన కొద్ది మంది కౄరంగా తెల్లవారు అణచి వేసినారు. ఇంతకు ముందు నేను యూరోపు వాళ్ళు వెల్లక ముందు అక్కడ అంతా ఖాలీ అనుకుంటూ ఉండేవాడిని!

2. యూరోపు, ఆసియా అడ్డంగా ఉండుత వల్ల, మిగిలిన ఖండాలు ఆఫ్రికా, అమెరికా లు నిలువుగా ఉండుట వల్ల కూడా ఈ యురేషియా వాళ్ళ డామినేషనుకు బీజాలు పడినాయి.

3. ఇలాటి డామినేషను అనేది వారి వారి నైపుణ్యం వల్లనూ, జాతి గొప్పతనం వల్ల కాకుండా కేవలం అదృష్టం వల్ల, అడవిలో చక్కని పంటలు ఉండుటం వల్ల, వారికి ఆవు, గుర్రం గొర్రెలు వంటి జంతువులు పెంచడానికి వీలవడంవల్ల మాత్రమే జరిగినది. అంతే కానీ ఒక జాతి మరో జాతి కన్నా గొప్పది ఎట్టి పరిస్తితిలోనూ కాదు అని రచయత చెపుతారు.

4. అనేక పర్యాయములు ఎలా అత్యంత కౄరంగా ఆదిమ వాసులను ఈ తెల్లోల్లు చావదొబ్బినది వ్రాసినారు. మిలియన్ల కొద్దీ జనాభాను కాల్చి పారేసినారు. వీరేనా ఇప్పుడు మానవ హక్కుల గురించి గొంతు చించుకుంటుంది అనిపిస్తుంది.

రాజ్యం వీర భోజ్యం అనిపిస్తుంది.

కాకపోతే ఆ వీరులను తయారు చేసినది మాత్రం రైతు అని చెప్తాడు రచయత. రైతు పంట్అ పండించుట వల్ల (ఇంతకు ముందులా వేట వల్ల కాకుండా) ఆహారం మిగులు లభించి బ్యూరోక్రాట్లు, రాజులు, వీరులు మొదలగు వారు తయారు అవ్వగలిగినారు (వారు ఇప్పుడు తిండి సంపాదించనవసరం లేదు కదా)

అన్నిటికీ రైతే మూలం, రైతే రాజు!

ఇంకా చాలా ఉన్నది చెప్పవలసినది కానీ ప్రస్తుతానికి ఇది చాలు మీరు కూడా ఈ పుస్తకాన్ని చదవండి.

jaared-DaimaMD-vraasina-gana (Read this in English Script, but Telugu Language)

Upgrading my wp to latest… ….(update) is completed!

Jun 19
2007

On popular request,

With Sudhakar’s heavy lobbying..

I am upgrading my wp.

May God Bless me.

Will change the template after it.

[update]

is done

so easy

But if you are trying keep a backup of everything you are ovewriting, good admin will always have backups

Now will try to change a template…

upgrading-my-wp-to-latest-update-is-completed (Read this in English Script, but Telugu Language)

nice paintings from Khammam guy!

Jun 15
2007

http://www.photoworks.com/photo-sharing/shareSignin.jsp?shareCode=ADF3232C3B6&cp=ems_shr_alb_pml&cb=PW

 

Now with Uncle Sam

 

 

nice-paintings-from-khammam-guy (Read this in English Script, but Telugu Language)

బాలకృష్ణకు స్వల్ప అస్వస్థత

Jun 14
2007

బాలకృష్ణకు స్వల్ప అస్వస్థత

దానవాయిపేట, జూన్‌ 13 (ఆన్‌లైన్‌): ప్రముఖ సినీ హీరో నందమూరి బాల కృష్ణ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. జలుబు, జ్వరంతో బాధపడుతున్న బాల కృష్ణ బుధవారం రాజమండ్రిలోని స్వతంత్ర ఆసుపత్రిలో చికిత్స చేయించుకున్నారు. దేవీపట్నం వద్ద పూడిపల్లిలో ‘ఒక్క మగాడు’ షూటింగ్‌లో పాల్గొన్న బాలకృష్ణ హఠాత్తుగా అస్వస్థతకు గురయ్యారు. తానే స్వయంగా కారు నడుపు కుంటూ ఆసుపత్రికి వచ్చారు. విషయం తెలుసుకున్న ఫ్యాన్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రత్నాకర్‌, టిడిపి అధికార ప్రతినిధి గన్ని కృష్ణ, బాలకృష్ణను కలిసి పరామర్శించారు.

 

source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2007/jun/13state4 

baalakRshNaku-svalpa-asvas (Read this in English Script, but Telugu Language)

suddenly I got double the hits!

Jun 12
2007

Today when I looked at stats, it is double the normal number of hits!

 

I am so surprised, is it because of eenadu, but to my dis appointment I got hits from the following one!

‘TechrigyBot – www.techrigy.com support@techrigy.com’ 2280

 

 

When I went to their site it says…

 

Real–time social media management for enterprises.

Blogs and wikis are rapidly spreading throughout enterprises. Employees are communicating through these media at work and at home. Is your organization aware of what employees are writing through their blogs and wikis? Are communications through social media being monitored for liability risks and being retained in case of litigation?

Techrigy’s Social Media Manager (SM2) is an enterprise–level management tool that helps organization control and monitor blogs and wikis that employees are utilizing. Techrigy’s SM2 inventories all blogs and wikis being used in an organization, records these communications and monitors them for risks and liabilities.

SM2 helps prevent your organization from being damaged by employee blogs and wikis and ensures that your organization will be able to meet regulatory compliance standards.

 

So who is monitoring my site?

 

!

 

BTW does their algorithm covers Telugu? Or it is just a link based algorithm?

 

 

suddenly-i-got-double-the-hits (Read this in English Script, but Telugu Language)

బర్త్ వీక్ ఈజ్ ఓవర్ :)

Jun 09
2007

బర్త్ వీక్ ఈజ్ ఓవర్ :)

మితృలారా అందరికీ ధన్యవాదములు.

ముఖ్యముగా అర్థ రాత్రి ఫోను చేసి స్విచ్ ఆఫ్ చేసి ఉన్నా తిట్టుకోకుండా పొద్దు పొద్దున్నే శుభాకాంక్షలు చెప్పిన వారికి :)

ఆఫీసులో సొంత డబ్బులతో కేక్ తెచ్చిన టీం మేట్లకు

ఆర్కుట్లో నాలుగు రోజుల ముందు నుండే హడావుడి మొదలు పెట్టిన వారికి :) జూన్ ఆరు బర్త్ డే కమ్యునిటీ వారికీ :)

చాటింగ్లో కలిసి శుభాకాంక్షలు చెప్పిన వారికి, ఫోను చేసి చెప్పిన వారికి మెయిల్ చేసిన వారికి అందరికీ పేరు పేరునా శుబాకాంక్షలు.

మరీ ముఖ్యముగా బ్లాగు పోస్టులు వ్రాసి ఆకాంక్షలు అందించిన జ్యోతి గారికీ, నవీన్ గారికీ.

నవీన్ గారు కొద్దిగా ఎక్కువ చెప్పినారు నేను వారికి పెద్దగా సాయం ఏమీ చెయ్యలేదు ఫలానా ఫలానా లింకులు, టూల్స్ ద్వారా మీరు తెలుగు యూనీకోడులో వ్రాయ వచ్చు అని చెప్పినాను అంటే, వారికి ఎంతో తెలుగు ప్రేమ ఉండుట వల్ల ఉపయోగ పరచు కున్నారు. ఆ మాట కొస్తే చాలా మందికి రోజుల తరబడి తెలుగులో ఇలా వ్రాయ వచ్చు అని కూర్చోని చెప్పినాను, చాటింగులో చెప్పినాను, ఫోన్లలో చెప్పినాను వారంతా బ్లాగులు మీలాగా అద్భుతంగా వ్రాయడంలేదు కదా! ఇందు మూలంగా నే చెప్పొచ్చేదేమిటంటే నే కేవలం నిమిత్త మాతృన్ని గొప్ప తనమంతా మీదే సిన్సియరుగా.

దిస్ ఈజ్ యే మెమొరబుల్ డే!

 

 

bart-veek-eej-Ovar (Read this in English Script, but Telugu Language)

vennela gaari kaarTOns

Jun 09
2007

vennela gaari kaarTUns  

This is too good!

vennela-gaari-kaartons (Read this in English Script, but Telugu Language)

విజువల్ స్టూడియో టిప్పు: పాతవి పేస్టు చేయడం!

Jun 09
2007

విజువల్ స్టూడియో టిప్పు: పాతవి పేస్టు చేయడం!

మీరు ఏదన్నా కాపీ చెయ్యాలంటే ఏమి చేస్తారు? కంట్రో సీ(లేకపోతే కంట్రోల్ యక్స్ :) లేకపోతే

ఎలుక పిల్ల కుడి చెవి నులిపెట్టి కాపీ , కట్ లు నొక్కుతారు)

అదే పేస్టు చెయ్యాలంటే ఏమి చేస్తారు?

కంట్రోల్ వీ చేస్తారు కదా!

మరదే మీరు పాతవి పేస్టు చెయ్యాలంటే , అనగా మీరు ఓ లైనుని కాపీ చేసినారు, పేస్టు చేసినారు; తరువాత రెండవలైనును కాపీ చేసినారు పేస్టు చేసినారు ; మరళా మొదటి లైనుని పేస్టు చెయ్యాలంటే ఏం చేస్తారు?

నాకు తెలుసు మీరేమి చెప్పబోతున్నారో! మొదతి లైనుకి వెళ్ళి కాపీ చేసి మరళా పేస్టు చేస్తారు కదా! ఇది నాకు వెనకటికి ఎవడో హింది వచ్చు అని అడిగితే ఇక్కడికి రా అనడాన్ని ఏమంటారు అంటే “ఇదర్ ఆవో ” అంటారు; మరి అక్కడకి వెళ్లు అనడాన్నీ? అక్కదికి వెళ్లి “ఇదర్ ఆవో ” అన వచ్చు కదా! అనే జోకు గుర్తుకు తెస్తుంది.

మీరు పాతవి పేస్టు చెయ్యాలంటే సింపుల్గా కంట్రోల్ వీ బదులుగా కంట్రోల్ + షిఫ్ట్ పట్టు కొని వీ రెండు సార్లు నొకాలి. (కంట్రోల్ + షిఫ్ట్ ను వదల కూడదు సుమా !) ఇలా మీరు వీ నొక్కుతూ ఉంటే మీకు పాతవి పేస్టు అవుతూ ఉంటాయి. ఈ విధంగా మొత్తం విజువల్ స్టూడియో 12 పాత కాపీలు గుర్తు ఉంచుకుంటుంది.

vijuval-sTooDiyO-Tippu-2 (Read this in English Script, but Telugu Language)

హిరణ్యలోకే 10

Jun 09
2007

 

 హిరణ్యలోకే ముందటి బాగాల కోసం ఇక్కడ చూడండి

 

 

                             కళ్ళ ముందు చీకటి పొరలు ఒకటొక్కటిగా ఆవరించుకున్నాయి. గుండెల మీద కొండ పెట్టినంత బరువు, కాలివేలు కూడా కదల్చలేకపోతున్నాడు. చేతులకి రక్తం తడితడిగా తగలసాగినది, తనదే అనుకుంటా. ఆలోచనలు కూడా ఆగిపోసాగినాయి. పైన రాబందు రెక్కల చప్పుడు. ఇంకొంచెం ముందుకు వెళ్లాలని విశ్వప్రయత్నం చేసినాడు, కానీ శరీరంలో ఏ అవయవం కూడా మాట వినలేదు. మనసు ఒక్కటే కొద్దిగా చురుగ్గా ఉన్నది ఏదో ఒకటి చెయ్యాలి – ఏదో ఒకటి చెయ్యాలి – కానీ ఏం చెయ్యాలి?

 

                             ఆఖరి మెరుపు – దీపం ఆరిపొయ్యే ముందటి వెలుగు, ఓ ఆలోచన అలా చేస్తే బాగానే ఉంటుంది. కానీ శరీరంలో ఏ అవయవమూ సహకరించడంలేదు. చిట్ట చివరి ప్రయత్నంగా గుండెల నిండా గాలి పీల్చుకొని బొటన వేలు నుండి శక్తిని కూడగట్టుకొని చేత్తో నడుముకున్న సీసా తిసి మూత తీద్దామని ప్రయత్నించినాడు కానీ ఒంట్లో మిగిలిన రెండు మూడు బొట్ల శక్తి అయిపొయినది. ఆ సీసా అలాగే పక్కకి వాలి పొయింది. సీసాతో పాటే శరీరం కూడా పక్కకి వాలిపొయింది. పైనున్న  రాబందు సంతోషంగా రెక్కలు కొట్టింది.

 

—-

 

 

ఆరతులు నీకే గదాఁ
ఆరళ్ళింకానా ఆనందా!

అతివల మోహనారతులు
అతి ఘన హారతులు
మితిలేకన్నీ నీకే గదాఁ

ఆరతులు నీకే గదాఁ
ఆరళ్ళింకానా ఆనందా!

 

…….

 

 

 

ఇక్కడికివచ్చి ఎన్ని రోజులవుతుందో తెలీదు, ప్లవంగంలో(1) ఏదో ఫాల్టు వచ్చి సేఫ్టీ ఆపరేషన్స్ కూడా ఫెయిల్ అయినట్టు గుర్తు. ఆ తరువాత కళ్ళు తెరిచేసరికి ఇక్కడ ఉన్నాడు. ఎలాగో తజూమా(2) ఉండటం వల్ల వీరితో మాట్లాడటం పెద్ద ఇబ్బంది కాలేదు. నెమ్మది నెమ్మదిగా వీరి భాష అలవాటయింది. తెలుగులోనే మాట్లాడుతున్నారు, కానీ కొద్దిగా పాత కాలం నాటి భాషలాంటిది. కాళ్ళూ చేతులు అన్నీ ఇప్పుడిప్పుడే పని చేస్తున్నాయి. తను ఉన్నది చిన్న గదిలాంటిది పైన అన్నీ ఆకులు! గాలీ, వెలుతురు వారవడానికి మంచి ఏర్పాట్లు ఉన్నాయి. పై కప్పుతో పాటు చుట్టూ గోడలు కూడా ఆకులు కట్టెలతో కట్టినారు. తన్ను మధ్యలో చెక్క బల్లపై పడుకోబెట్టినారు. కసూక(3) (చాలా రోజులకు గానీ ఆమె పేరు తెలీలేదు) రోజూ వచ్చి రకరకాల ద్రావకాలు తాగిచ్చి వెళ్తుంది. అప్పుడప్పుడూ మంచి పాటలు పాడుతుంది. ఇప్పుడు కూడా తనే అనుకుంటా పాడేది. చాలా చక్కగా పాడుతుంది అర్థం కాకపొయినా వినడానికి బాగుంటాయి. అప్పుడప్పుడూ చిన్న పిల్లలిద్దరు సంగీతం కూడా వాయిస్తుంటారు. ఇంకా ఆధారం లేకుండా నడవటం అలవాటు కాలేదు. రెండు కర్రముక్కలు పట్టుకోని నడుస్తున్నాను. మొత్తం ఇటువంటివి ఓ పది ఇళ్ళు ఉన్నాయి. ముసలతను మాత్రం ఎప్పుడూ ఇక్కడె ఉంటాడు, ఎప్పుడో కాని బయటకు వెళ్ళడు. రోజూ సాయంత్రం ఆరుగురు పిల్లల్ని కూర్చోబెట్టుకొని కథలు చెప్తాడు. కొద్ది కొద్దీగా వినపడుతుంటాయి మరీ కొద్దిగా అర్థం అవుతుంటాయి. దగ్గరలోనే అడవి ఉన్నట్టున్నది. ఎవరితోనన్నా కాంటాక్టు అవుదామని ప్రయత్నించినాడు కానీ వీలవలేదు అన్ని పరికరాలూ మూగబొయినాయి.

 

నెమ్మదిగా రెండు కర్రలు పట్టుకోని బయటకు వచ్చినాను, ఇటువంటి సమయంలో కానీ కాళ్ళ విలువ ఏమిటో తెలీదు. తాత ఇవ్వాళ బయటకి వెళ్తున్నట్టున్నాడు. పిల్లలతో ఉత్సాహంగా అశిక్(4) (వాళ్ళు చెప్తేనే తెలిసింది దాని పేరు) ఎక్కి పొసాగినాడు. వెనక మిగిలిన ఆరుగురు పిల్లలు అతన్ని ఫాలో అవ్వసాగినారు. ఇంతలో కసూకా అతనికి ఎదురుగా వచ్చ్నది. ఏదో సీరియస్ గా చెప్తుంది కానీ వినపడలేదు. తాత ఇంకేదో నవ్వుతూ అన్నాడు ఆ తరువాత అందరూ వెల్లిపొయినారు అడవి వైపుగా, కసూకా వారు వెళ్ళిన వైపే చూడసాగినది.

 

 

 

“తాతా! మేము తయారు” అంటూ పిల్లలంతా ఒక్కసారిగా అరిసినారు.

“వస్తున్నా! వస్తున్నా!” అంటూ ముసలతను హడావుడిగా బయటకి వచ్చి తన కొసం ఎదురుచూస్తున్న అశిక్లపై ఆసీనులైన ఆరుగురు పిల్లలనూ గమనించినాడు. వారి వెనకే ప్రత్యక్ష్యం అయిన సూర్యుణ్ణి చూసి మరళా లోపలికెళ్ళి సంచి ఒకసారి జాగ్రత్తగా చూసుకొని సిద్దం అయి బయటకి వచ్చి అశిక్కును ఎక్కినాడు.

“తాతా నువ్వు రాన్రానూ పిల్లల కోడిలా తయారవుతున్నావు”

“అవున్రా ఆరు పిల్లల కోడి” అంటూ ఓ నవ్వు నవ్వి ముందుకి వెళ్ళినాడు.

పిల్లలంతా అతనితో కలిసి నవ్వుతూ బయల్దేరినాడు.

“మృత్యువు పోరాడుతుంది” ఒక విధమైన ఆశ్చర్య భయాలతో కూడిన మొహంతో క్సూకా ఎదురైంది.

“మృత్యువెప్పుడూ పోరాడుతూనే ఉంటుంది” అంటూ తాత బదులు చెప్పి ఆమె కోసం ఆగకుండా బయలుదేరినాడు.

కసూకా ఆ ఏడుగురివైపు అలాగే చూడసాగినది.

 

 

చల్లటి గాలులు మొహాన్ని తాకుతున్నాయి. సూర్యునికిరణాలు ముందునుండి. ఇన కిరణాలు వెనకనుండి వాతావరణాన్ని వెచ్చబరచాలని ప్రయత్నిస్తున్నాయి. పొలాలు దాటి చిట్టడివిలో చాలా దూరం వచ్చేసినారు. మజోరు(5) అప్పటికే రెండు చిమాలీలను(6) తన బాణాలకు తగిలించి అశిక్పై ఉంచి అప్పుడప్పుడూ గర్వంగా పక్క వాళ్లవైపు చూడసాగినది. కనుచూపులోకి అడవిరాగానే అందరూ ఒక్కసారిగా రెట్టించిన ఉత్సాహంతో అశిక్ లను పరుగులెత్తించారు. ముందు దాత్తుడు(7) అతని వెనక అందరి కంటే చిన్నది, చిచ్చరపిడుగు అని పేరు తెచ్చుకున్న మజోరు ఆ తరువాత నల్గురూ వారి వెనుక జాగ్రత్తగా ముసలోడు అశిక్ లను వేగంగా పరుగులు తీపించసాగినారు. అడవిలో చెట్లూ ఆకాశాన్నంటుతున్నాయా అనిపిస్తూ గాలికి ఓ రకమైన శబ్దం చేస్తూ వచ్చే అతిధులకు ఆహ్వానం చెప్పడానికన్నట్లు కొమ్మలను ఊపసాగినాయి.

 

 

జమేలీ(8)… అంటూ దాత్తుడు నెమ్మదిగా అని ఒకటి తరువాత ఒకటిగా మూడు బాణాలు వదిలినాడు. పరుగులు తీస్తున్న జమేలీ జంతువుకు గురి తప్పకుండా మూడు తగిలినాయి. ఆ మూడింటితో పాటు మరో రెండు మజోరీ బాణాలు కూడా తగిలి అది అక్కడే నేల కూలింది. మరోసారి మజోరి గర్వంగా తోటివారివైపు చూసింది. ఆ తరువాత దాత్తుడివైపు అదే విధంగా చూడబోయి ఆగిపొయింది. అతని మొఖంలో ఏదో ఆందోళన!

 

 

అప్పటికే ఆ విషయాన్ని గమనించిన తాత కూడా దిగి దాత్తుడు చూస్తున్న కాలి జాడలు చూసినాడు. చాలా జమేలీలు వెళ్ళిన అడుగు జాడలు కానీ వాటితో పాటు కనపడీ కనపడకుండా వేరే అడుగుజాడలు దాత్తుడికవేమీ అర్థం కాలేదు. తాతవైపు చుసినాడు. తాత జాగ్రత్తగా వాటిని చేత్తో పట్టుకోని “హురా(9)” అన్నాడు నెమ్మదిగా… అదీ కేవలం దాత్తుడికే వింపడింది. అప్పుడే వారితో కలిసి జమేలిపై బాణాలు లాగి వీరివైపు ఆశ్చర్యంగా చూసినది మజోరి .

“పదండి పిల్లలూ!” అంటూ తాత అశిక్ ఎక్కి “మనం త్వరగా ఇంటికి వెళ్తున్నాం” అంటూ ముగించినాడు.

 

మజోరి ఆ జమేలీని కూడా తన అశిక్పై వేసుకొని ముందుకు సాగినది. మరొకప్పుడు అయితే ఆ జమేలీకి ముందు తన బాణమే తగిలిందని గొడవ చేసేవాడు, కానీ ఇప్పుడన్నీ పట్టిచ్చుకునే ఆలోచనలు లేవు. “హురా!” అన్న పేరు విన్నప్పటినుండీ ఆలోచనలు వాటి చుట్టూనే పరిభ్రమిస్తున్నాయి. ‘కకూట”(10) సైన్యంలో హురాలు రాక్షసత్వానికి మారుపేరు. అవి వేగానికి బలానికి మారుపేరు. వాటి చేతిలో కత్తి ఉన్నంతవరకూ వాటి ధాటికి ఎవరూ ఆగలేరు. ఎవరినైనా వాసన చూశాయంటే ఎంత దూరానున్నా, ఎన్ని రోజుల తరువాత అయినా వెంబడించి వెంటాడి కౄరంగా హతమారుస్తాయని పేరు. అటువంటి హురాలు ఇప్పుడు ఇక్కడ!

 

 

ఇంకొంచెం ముందుకెళ్ళేసరికి జమేలీల గుంపు కంపించింది.

బరూజా(11)” మొదటి బాణ్ణాన్ని వేసి ఓ జమేలీని పడగొట్టింది. ఆ దెబ్బకి మిగిలినవన్నీ చెల్లా చెదరయి బెదిరి పారిపోసాగినాయి. ఆర్గురూ ఒకదాని వెనక ఒకటిగా బాణాలు చాలా వరకూ నేలను తాకసాగినాయి. ఒకటీ అరా తగిలినా జమేలీలు క్షణాల్లో మాయమవ్వ సాగినాయి.

దాత్తుడు తాతవైపు చూసినాడు. తాత ఏదో ఆలోచించసాగినాయి. కళ్ళు చూస్తున్నాయి కానీ మనసు మాత్రం ఎక్కడో ఉన్నది.

“ఏమిటి తాతా?”

“ఏదో తేడాగా ఉందిరా!”

ఒక్కసారిగా గాలి వాలు మారింది. అప్పటికిగాని అర్థం కాలేదు గాలిలో ఏదో వాసన బాగా పరిచయమున్నది.

“వెనక్కి వెనక్కి” అంటూ తాత అందరినీ హెచ్చరించి అశిక్కుని వేగంగా వెనక్కి తిప్పినాడు.

ఎవరికీ ఏమీ అర్థం కాలేదు. అయినా అందరూ జమేలీలను వదిలి తాతను వెంబడించినారు. కొద్ది దూరంలో రక్తపు మడుగులో శవం! దాని పక్కన ఓ పగిలి పొయిన సీసా, దానిలోనుండి బయటకు వచ్చిన ద్రావకం! అప్పటికి కానీ దాత్తుడికి అర్థం కాలేదు తాత వాసన చూసినది ఆ ద్రావకాన్నే అని.

తాత ఆ మనిషిని చూసి ఒక్కసారిగా నిశ్చేష్టుడయినాడు. తరువాత అ శవం దగ్గరికి వెళ్ళి చూసి ఒక్కసారిగా “ప్రాణం ఉన్నది” అని అరచి పిల్లలవైపు చూసినాడు.

ఆ తరువాత పనులన్నీ చాలా వేగంగా జరిగినాయి. ప్రాణం ఎక్కడో కొట్టుమిటాడుతుంది. చెయ్యవలసిన కొద్ది వైద్యం చేసినారు. రక్తం ఆగడానికి కట్లు కట్టినాడు. సంచీలోనుండి మూలికలు శరీరమంతా దట్టించినాడు. అతన్ని తాత తన అశిక్కుపై వేసుకోని వేగంగా ఇంటివైపు బయల్డేరినాడు. ఆందోళనతో కూడిన వేగంతో! ఎదురవుతున్న ప్రమాదాన్ని గురించి తెలియకుండా!

 

 

—————————————————————–

 

మొదటి పాల పుంత వారి మ్యూజియంలోని ఓ పురాతన టాప్టాపు నుండి

1. ప్లవంగం – ఇది రెండవ తరగతికి చెందిన రవాణా సాదనం, మానవులు గెలాక్సీని అప్పుడప్పుడే జనావాసాలుగా మారుస్తున్నప్పుడు ఒక గ్రహాన్నుండి మరొక గ్రహానికి వెళ్ళడానికి ఉపయోగించినది, మొదటి భూమికి చెందిన వారు దీనిని తయారు చేసి విప్లవానికి భీజం వేసినారు. అన్నిటికంటే ఎక్కువ రోజులు వాడబడిన మోడలుగా దీని కీర్తి నిల్చుండి పొయినది.

 2. తజూమా : ఇది ఒక అనువాద సాధనం. ఒకప్పుడు లెక్కకు మిక్కిలిగా ఉన్న మానవ బాషలను ఆటోమేటిగ్గా రియల్ టైంలో అనువదించడానికి తయారు చేయబడిన సాధనం. ఆ తరువాత విశ్వమంతా ఒకే బాష అమల్లోకి వచ్చిన తరువాత దీని ఉపయోగం లేకుండా పొయినది. కొన్ని రోజుల పాటు పాత డాక్యుమెంట్లను తర్జుమా చేయడానికి వాడేవారు కానీ అన్ని డాక్యుమెంట్లూ తర్జుమా చేసిన తరువాత ఇది కేవలం మ్యూజియంలకు మాత్రమే పరిమితం అయినది.

3. కసూక : ఇది ఒక మనిషి పేరు. ఈ పేరుతో ప్రసిద్ధి చెందిన వ్యక్తులు ………………345456556 హిరణ్య లోకంలో కసూకా అనే ఆవిడను కలుసుకున్నట్టు హిరణ్య లోకే అనే తన ఆత్మానుగత కథలో ఓ సింప్యూటరిస్టు వ్రాసినారు. అయితే ఇప్పుడు ఆ పుస్తకం లభించడంలేదు వారు వీరు ఆ పుస్తకం గురించి వ్రాయగా మాత్రమే మనకు ఈ వివరాలు లభిస్తున్నాయి. ……………………………………………

 

4. ఆశిక్ : హిరణ్య లోకమునకు వెళ్లిన మొదటి తరగతి వ్యక్తులు వాడిన రవాణా జంతువు. బూమిపై తొలి నాటి గుర్రం జాతికి చెందినది. ప్రస్తుతము లుప్తము, మరిన్ని వివరాలు తెలీదు.

 

5. మజోరు: ఇది ఒక వ్యక్తి పేరు. చరిత్రలో ఈ పేరుతో ప్రసిద్ది చెందిన వారు…. 45556789: మజోరు అనే రాణి హిరణ్య గ్రహాన్ని కొంత కాలం పరిపాలించినట్టు తెలుస్తుంది. మరిన్ని వివరాలు తెలీదు.

 

6. చిమాలీ : రుచికరమైన ఆహారపు జంతువు, ప్రస్తుతము రక్షిత వర్గములీనిది మొత్తం జనాభా కేవ్లాం 3459 మాత్రమే

 

7. దాత్తుడు: ఇది ఒక వ్యక్తి పేరు. ఈ పేరుతో చరిత్రలో ప్రసిద్ది చెందిన వారు 1: హిరణ్య లోకపు చారిత్రక వీరుడు

 

8. జమేలీ: రుచికరమైన ఆహారపు జంతువు ప్రస్తుతము కేవలము ఇంగీటా పాలపుంతపై మాత్రమే కంపడతాయి.

 

9. హురా: భయంకరమైన యుద్ధ జంతువులు వీటికి తెలివి తేటలు కూడా ఉన్నాయని అంటారు. వీరాధి వీరుడు దాత్తుడు వీటి నన్నింటినీ నాశనం చేసినాడని హిరణ్య లోకపు కథలు చెప్తున్నాయి. అయితే అటువంటివేమీ లేవని ఇప్పుడు చాలా మంది చెపుతారు అయినా ఎవరి నమ్మకాలు వారివి కదా! హిరణ్య లోకంపై వీటిని ఉన్నాయి అని చెప్పడం ఓ నేరం.

 

10. కకూట : ఇది హిరణ్య లోకంలోని కౄరమైన జాతిగా పేర్గాంచినది.

 

11. బరూజా: ఇది ఒక వ్యక్తి పేరు …………………….

hiraNyalOkE-10 (Read this in English Script, but Telugu Language)

వుయ్ వాంట్ బ్లాగ్ హాలిడే ఫ్రం యువర్ బ్లాగ్ :)

Jun 09
2007

బ్లాగులో ఏమన్నా వ్రాద్దామని ఓ గంట తీరిక చేసుకునానా ఈ కూడలి చదివే సరికే ఆ గంట కాస్తా అయిపోతుంది, ఇలా అయితే నా బ్లాగులో నేనెప్పుడు వ్రాసేది

ఇదిగో మీరంతా ఓ నాల్రోజులు బ్లాగ్ హాలిడే తీసుకోని నా లాంటి వారికి కూడా వ్రాసే టైం ఇవ్వమని ముందే చెపుతున్నా

vuy-vaaMT-blaag-haaliDE (Read this in English Script, but Telugu Language)

RTSMirror Powered by JalleDa